బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది వామికా గబ్బి. బాలీవుడ్లోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే తను నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా, తాజాగా టాలీవుడ్లో ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్‌కు జంటగా నటించే అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్‌తో కలిసి ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో నటిస్తుండగా, ఆయన నెక్స్ట్ మూవీ కోసం వామిక గబ్బిని ఫైనల్ చేశారట. ‘పుష్ప’ తోపాటు పలు సూపర్ హిట్ చిత్రాలకు రైటర్‌గా వర్క్ చేసిన శ్రీకాంత్ విస్సాను దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనున్నాడని, ఇందులో హీరోయిన్గా వామికను ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
